HIT-3: నాచురల్ స్టార్ నాని తెలుగు సినిమాలో తన మార్కెట్‌ను ఓ రేంజ్‌లో సెట్ చేశాడు. ‘దసరా’ చిత్రంతో భారీ హిట్ సాధించిన నాని, మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఇప్పుడు ‘హిట్ 3’తో తన సత్తా చాటి, సరికొత్త రికార్డులు తిరగరాశాడు.
‘దసరా’ తొలిరోజు వరల్డ్ వైడ్ 38 కోట్ల గ్రాస్ రాబట్టగా, ‘హిట్ 3’ మొదటి రోజు 43 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఇది నాని కెరీర్‌లో ఆల్ టైం హైయెస్ట్ రికార్డుగా నిలిచింది.
Also Read: Company: 23 ఏళ్ల ‘కంపెనీ’ RGV ఎవర్‌గ్రీన్ క్లాసిక్!
HIT-3: ఈ వీకెండ్ నాటికి సినిమా 150 కోట్ల మార్క్‌ను సునాయాసంగా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అర్జున్ సర్కార్ పాత్రలో నాని చేసిన హడావిడి అభిమానులను ఫిదా చేస్తోంది. మిడ్ రేంజ్ హీరోగా నాని విజయాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం. ‘హిట్ 3’తో నాని మరోసారి తన స్టామినా నిరూపించాడు!
హిట్ 3 తెలుగు ట్రైలర్ :