- Nandamuri Suhasini: నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. 2018లో నల్గొండ జిల్లాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
ఇకపోతే, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో పెద్ద దుమారం రేపాయి. తారక్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ఇలాంటి సందర్భంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై ఆయన సోదరి నందమూరి సుహాసిని కీలక వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణకు నివాళులర్పించిన సుహాసిని, మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, “ప్రస్తుతం తారక్ పూర్తిగా సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు” అని స్పష్టంగా చెప్పారు.
హరికృష్ణ వారసత్వాన్ని కొనసాగించే వ్యక్తిగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అభిమానుల్లో ఆశలు రేపింది. సుహాసిని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు.
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు