Ibomma Ravi: ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ iBOMMA వ్యవస్థాపకులలో ఒకరైన రవిని కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతిని ఇచ్చింది. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన రవిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసులు వారం రోజులు కస్టడీకి కోరగా, దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఐదు రోజులు కస్టడీకి మాత్రమే అనుమతి మంజూరు చేసింది.
ఎందుకీ కస్టడీ?
పైరసీకి పాల్పడటం, కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడం వంటి తీవ్రమైన ఆరోపణలు రవిపై ఉన్నాయి. ఈ కేసులో iBOMMA వెబ్‌సైట్ ఎలా పనిచేస్తుంది, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి అనే కీలక వివరాలను రాబట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కస్టడీలో విచారించనున్నారు.
ఈ ఐదు రోజులలో, ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలు, డాటా కేంద్రాలు, ఇతర సహచరుల గురించి మరింత లోతైన సమాచారం బయటపడే అవకాశం ఉంది.

