Nampally Court: ప్రముఖ సినీ నటులు వెంకటేష్, రానా దగ్గుబాటి సహా సురేష్ బాబు, అభిరామ్ దగ్గుబాటిలకు నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా, ‘డెక్కన్ కిచెన్’ హోటల్‌ను కూలగొట్టిన కేసులో వీరు నలుగురు తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కేసు వివరాలు ఏమిటంటే:
నాంపల్లి కోర్టులో ‘డెక్కన్ కిచెన్ హోటల్’ కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హోటల్‌ను కూలగొట్టినందుకు వెంకటేష్, రానా, సురేష్ బాబు, అభిరామ్‌లపై కేసు నమోదైంది.
నవంబర్ 14న హాజరు కావాలి:
ఈ విచారణలో భాగంగా, నలుగురు నిందితులు కోర్టుకు హాజరై ‘పర్సనల్ బాండ్’ సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అందుకోసం నవంబర్ 14వ తేదీన దగ్గుబాటి వెంకటేష్, రానా, సురేష్ బాబు, అభిరామ్ కోర్టులో తప్పనిసరిగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.