Nama Nageswara Rao: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును బీఆర్ఎస్ పార్టీయే నిలబెట్టిందని ఆ పార్టీ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్టీఆర్ అతి పెద్ద విగ్రహం పెట్టించి, ఆయన చరిత్రను మొత్తం అక్కడి లిఖించి ప్రజలకు తెలిసేలా చేసిందని గుర్తుచేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్టీఆర్కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
Nama Nageswara Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటూ ఈ రోజు సీఎం రేవంత్రెడ్డి ఆయన పేరును వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుంచి మూడు సార్లు గెలిచి, అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టలేదని తుమ్మల నాగేశ్వరరావును నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు.
Nama Nageswara Rao: ఖమ్మంలో తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఆయన విగ్రహం పెడతామని మాయమాటలు చెప్తున్నారని నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలెవరూ నమ్మబోరని స్పష్టంచేశారు. ఎన్నికల కోసం ఎన్డీఆర్ పేరును వాడుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.
Nama Nageswara Rao: ఇదే సందర్భంగా నామా నాగేశ్వరరావు మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇక్కడ స్థిరపడిన పక్క రాష్ట్రాల వారిని నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అక్కున చేర్చుకున్నారని నామా నాగేశ్వరరావు చెప్పారు. ఈనాడు అధినేత గతంలో రామోజీరావును పక్క రాష్ట్రం పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తే.. తన రాష్ట్రం నుంచి ఎవరిని అరెస్టు చేయడానికి వీలు లేదని, రామోజీరావుపై చెయ్యి కూడా పడకుండా కేసీఆర్ నాడు అడ్డుకున్నారని నామా నాగేశ్వరరావు గుర్తుచేశారు.

