Nallagonda: నల్లగొండ జిల్లా కేంద్రంలో వినాయక ఉత్సవాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లు భవనాల శాఖ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్న గణేశ్ వేడుకల్లో బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేయడంతో వివాదం రగిలింది. పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
Nallagonda: నల్లగొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి విగ్రహం వద్ద ఈ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. అక్కడికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగిస్తుండగా, బీజేపీ నేతలు అభ్యంతరాలను వ్యక్తంచేశారు. గణేశ్ వేడుకల్లో రాజకీయ ప్రసంగాలు ఎందుకని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగ వర్షిత్‌రెడ్డి తదితరులు అడ్డుకోబోయారు. ఈ సమయంలో పోలీసులు వారిని వారించి తరలించే ప్రయత్నం చేశారు.
Nallagonda: ఈ సమయంలో పోలీసులతో బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు బీజేపీ నాయకులను అక్కడి నుంచి తరలించారు. బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి, బీజేపీ నేతలను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఇది సమంజసం కాదని వారు పేర్కొన్నారు.