Nagarjuna

Nagarjuna: ఒక్క ‘కూలీ’ చూస్తే వంద భాషల సినిమాలు చూసినట్టే

Nagarjuna: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం “కూలీ” విడుదలకు ముందు నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అద్భుతంగా తెరకెక్కించారని టాక్. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్, ఆడియో ఈవెంట్లు ఇప్పటికే ప్రేక్షకులలో ఓ రేంజ్‌లో క్రేజ్ క్రియేట్ చేశాయి.

ఈ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కింగ్ నాగార్జున ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఈ సినిమాలో నా పాత్ర తప్పకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్టర్ లోకేష్ నా క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడు” అని తెలిపారు.

అంతేకాదు,
“ఒక్క కూలీ సినిమానే చూస్తే వంద భాషల సినిమాలు చూసిన ఫీల్ వస్తుంది. అంత బలంగా ఈ సినిమా తీశాం. ఇది రజినీ ఫ్యాన్స్‌కి ఓ ఫైర్ వర్క్‌లా ఉంటుంది” అని చెప్పాడు నాగార్జున.

ఈ సినిమాలో రజినీకాంత్ స్మగ్లర్ “దేవ్” పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్ చూస్తే, అతను తనపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇక నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండటంతో మరింత ఆసక్తి పెరిగింది.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎం కూడా ట్రైలర్‌కు అదనపు ఆకర్షణగా మారింది.

ఇప్పటికే సినిమా ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆగస్టు 14న రిలీజ్ కాబోయే సినిమాకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Psycho Husband: సైకో మొగుడు...భార్య పిల్లల్ని అమెరికాలో వదిలేసి వచ్చిన భర్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *