Naga Chaitanya: నాగచైతన్య, శోభిత జంట దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైతూ తన జీవితంలోని పర్సనల్ కోరికలను బయటపెట్టాడు. సినిమాల బిజీ షెడ్యూల్ మధ్యలోనూ శోభితతో ఎక్కువ సమయం గడపాలని, వారి మధ్య దూరం రాకుండా కొన్ని నియమాలు పెట్టుకున్నామని చెప్పాడు. శోభితకు రేసింగ్ ట్రాక్‌లో డ్రైవింగ్ నేర్పించానని, ఆమె తనతో కలిసి డ్రైవింగ్‌కు వస్తోందని తెలిపాడు. 50 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడపాలనేది తన కల అని, కొడుకు అయితే రేసింగ్ నేర్పిస్తానని, కూతురు అయితే ఆమె ఇష్టానికి స్వేచ్ఛ ఇస్తానని చెప్పాడు. సినిమాల విషయానికి వస్తే..సాధారణ లవ్ స్టోరీలకు దూరంగా, భిన్నమైన కథలతో సినిమాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు చైతూ.
