Naga chaitanya: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. ఈ చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం వైజాగ్‌లోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ, “పుష్ప కా బాప్ అల్లు అరవింద్ నా జీవితంలో నిజమైన ‘తండేల్’. గత ఏడాదిన్నరగా ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. ఆయన లేకుండా నేను ఇంకో సినిమా చేయగలనా అనే భావన కలిగింది. ఈ సినిమాకు ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు చాలా ఉపయోగపడ్డాయి” అని అన్నారు.
నాగచైతన్య వైజాగ్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ, “వైజాగ్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నా సినిమా విడుదలైన వెంటనే మొదటగా వైజాగ్ టాక్ తెలుసుకుంటాను. వైజాగ్‌లో సినిమా ఆడితే ప్రపంచం మొత్తం ఆడినట్లే భావిస్తాను. పైగా వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ వాళ్లదే. కాబట్టి ‘తండేల్’ సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేదంటే మా ఇంట్లో నా పరువు పోతుంది” అని నవ్వుతూ చెప్పారు.
అల్లు అరవింద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నాగచైతన్య తన కెరీర్‌లో అత్యుత్తమ నటనను ఈ సినిమాలో చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో అతని నటన గుండె కరిగేలా ఉంది. ఈ సినిమా చైతన్యను మంచి నటుడిగా గుర్తింపును తీసుకువస్తుంది” అని ప్రశంసించారు.
అయితే ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు హాజరుకాలేదు.