Kalki-2

Kalki-2: 3 సంవత్సరాల తర్వాతే కల్కి 2.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

Kalki-2: భారీ అంచనాల మధ్య గత సంవత్సరం 2024 జూన్ లో విడుదలైన పాన్-ఇండియా సినిమా కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.1,050 కోట్లకు పైగా వసూళ్లు సాధించి. ఈ సినిమాలో  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో  నటించగా.. దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ముఖ్య పాత్రలో నటించారు. ఈ సైన్స్ ఫిక్షన్ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా హిట్ అవడంతో  దీనికి సీక్వెల్ గా రాబోతున్న ‘కల్కి 2 పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గతంలో దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్‌లు ఈ సీక్వెల్ 2025 చివరి నాటికి సెట్స్ పైకి వెళ్తుందని ప్రకటించినప్పటికీ, తాజాగా వచ్చిన సమాచారం మాత్రం అభిమానుల్లో టెన్సిషన్ ని పెంచేస్తుంది.

నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ “కల్కి 2 చిత్రీకరణ ప్రారంభం ఎప్పుడన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేను. ఈ సినిమా స్టార్టింగ్ కి చాలా అంశాలు ఉన్నాయి. ఇపుడు నటీనటులందరూ బిజీగా ఉన్నారు. ప్రీ-విజువలైజేషన్, యాక్షన్ సన్నివేశాలు చాలా భారీ స్థాయిలో ఉండబోతున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌కు సమయం పట్టడం సహజం, అని అన్నారు.

ఇది కూడా చదవండి: Vetri Maaran: వెట్రిమారన్ డబుల్ ధమాకా.. సింబు, ధనుష్‌తో రచ్చ!

అలాగే మేము ఈ సంవత్సరం చివరి నాటికి షూటింగ్ మొదలుపెట్టాలని ప్రయత్నిస్తున్నాం. కానీ చిత్రీకరణకే ఎక్కువ సమయం పట్టనుంది పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. కనీసం మరో 2-3 సంవత్సరాల తర్వాతే బిగ్ స్క్రీన్ పైన  ఈ సీక్వెల్‌ను అభిమానులు చూడగలరని నేను భావిస్తున్నాను అని వెల్లడించారు.

ఇక ప్రభాస్ ప్రస్తుత షెడ్యూల్‌ విషయానికి వస్తే, ఆయన ‘రాజా సాబ్’, ‘ప్రభాస్ హను’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరులోపు ‘రాజా సాబ్’ షూటింగ్ పూర్తిచేయనున్నప్పటికీ, ఇతర ప్రాజెక్టులు ఎక్కువ సమయం తీసుకోనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘స్పిరిట్’ సెప్టెంబర్ చివరి నాటికి లేదా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ బిజీ షెడ్యూల్‌లో ప్రభాస్ ‘కల్కి 2’ కోసం కొత్త లుక్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Minister Savitha: మహిళలకు గుడ్ న్యూస్.. లక్ష మందికి శిక్షణతోపాటు కుట్టు మిషన్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *