Nag Ashwin

Nag Ashwin: అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ!

Nag Ashwin: యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా 1000 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం కల్కి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఆలియా భట్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆలియా భట్‌కు ఓ స్టోరీలైన్ చెప్పాడని.. ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి సీక్వెల్ మూవీ ప్రారంభం కావడానికి సమయం పడుతుండటంతో నాగ్ అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.ఇక ఈ సినిమాతో ఆలియా భట్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుందట. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *