Ration Cards: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చేయాలనే లక్ష్యంతో పని చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ… రేషన్ కార్డుల పంపిణీ, సమస్యల పరిష్కారం, దీపం పథకం వంటి అంశాలపై వివరాలు వెల్లడించారు.
కొత్త రేషన్ కార్డుల వివరాలు:
-
కేంద్రం 60 శాతం రైస్ కార్డులకు నిధులు సమకూర్చుతోందని మంత్రి చెప్పారు.
-
16 లక్షలకు పైగా మార్పుల కోసం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
-
ఇప్పటికే 9 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్టు తెలిపారు.
-
మొత్తం 1 కోటి 45 లక్షల 97 వేల రేషన్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి.
-
వాటి ద్వారా 4 కోట్ల మందికిపైగా లబ్ధిదారులు లాభం పొందుతున్నారు.
డిజిటల్ రేషన్ కార్డుల విశేషాలు:
-
కొత్త రేషన్ కార్డులు డెబిట్ కార్డ్ సైజ్‌లో స్మార్ట్ కార్డుల్లా ఉంటాయి.
-
ప్రతి కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇది డేటాను స్కాన్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
-
కార్డుపై కేవలం కుటుంబ యజమాని ఫోటో మాత్రమే ఉంటుంది – రాజకీయ నాయకుల ఫోటోలు లేవు.
-
ఈ స్మార్ట్ కార్డులు ఉచితంగా లబ్ధిదారులకు ఇవ్వబడతాయి.
-
ఆగస్ట్ 25 నుంచి 31 వరకు రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది.
-
65 ఏళ్లు దాటిన వృద్ధులకు రేషన్‌ను హోమ్ డెలివరీ చేస్తోంది ప్రభుత్వం.
సమస్యల పరిష్కారానికి చర్యలు:
-
కొన్ని జిల్లాల్లో రేషన్ సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, ఆయా జిల్లాలకు వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
దీపం పథకం పురోగతి:
-
ఇప్పటివరకు 93 లక్షల 46 వేల మందికి దీపం పథకం కింద లబ్ధి చేకూరిందని చెప్పారు.
-
దీపం 2 పథకంకు ఈ నెల 31 వరకు అవకాశం ఉందని వెల్లడించారు.
-
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో డిజిటల్ వాలెట్ ఆధారంగా దీపం పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
-
ఈ కార్యక్రమం కోసం హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.