Vijay Thalapathy: తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తను నటిస్తున్న చివరి సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉన్ విజయ్ లాస్ట్ సినిమా తెలుగులో హిట్అయిన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. మెయిన్ స్టోరీ లైన్ తీసుకుని విజయ్ ఇమేజ్ కి, తమిళ ప్రేక్షకాభిరుచికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారట. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ పై ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. ఈ సినిమాకు ‘నాళై తీర్పు’ అనే టైటిల్ అనుకుంటున్నారట. అంటే ‘రేపటి తీర్పు’ అని అర్థం. వచ్చే దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుంది. విజయ్ నటించిన తొలి చిత్రం టైటిల్ కూడా ఇదే. దీనికి విజయ్ తండ్రి యస్.ఎ. చంద్రశేఖర్ దర్శకుడు. ఇక విజయ్ చివరి చిత్రంలో పూజా హేగ్డే హీరో్యిన్ గా నటిస్తోంది. ‘పేమలు’ నాయిక మమిత బైజు తెలుగులో శ్రీలీల పోషించిన పాత్రను చేస్తోంది. మరి తొలి సినిమా టైటిల్ తో ఆఖరి సినిమా చేస్తున్న విజయ్ కి ఈ సినిమాతో ఎలాంటి విజయం దక్కనుందో చూడాలి.
