Breaking News: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధి లో ని పాస్ పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న పురాతన ముత్యాలమ్మ ఆలయము లో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు విగ్రహలను ధ్వంసం చేసారు.దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేవాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నారు.
మత విద్వేషాలను ప్రేరేపించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి:మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మోండా మార్కెట్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై స్పందించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ . సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ . . నిన్నటి వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాత నవరాత్రులు, బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు ఇలా విగ్రహాల ధ్వంసం చేయడం వర్గం మనోభావాలను దెబ్బతీయడమే అని అన్నారు . దోషులు ఎంతటివారైనా పోలీసులు కఠినంగా శిక్షించాలి అని చెప్పారు .

