Marco Movie: ఉన్నిముకుందన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్కో’. మలయాళంలో ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను సాధించింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మలయాళంలో ఇప్పటికే పలు చిత్రాలు వంద కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్నాయి. అయితే ఆక్కడ ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చిన సినిమా వంద కోట్లను సాధించటం ఇదే తొలిసారి. గత ఏడాది డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇందులో వయొలెన్స్ కారణంగా ‘ఎ’ సర్టిఫిక్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఇలా A సర్టిఫికెట్ తో వచ్చి వంద కోట్లు సాధించటంతో మేకర్స్ తొలి ఎ రేటెడ్ వంద కోట్ల సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు. హనీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాక షరీఫ్ మొహహ్మద్ నిర్మాత. ఇటీవల ఓటీటీలో కూడా రిలీజ్ అయి అక్కడా ప్రేక్షకాదరణను పొందుతోందీ చిత్రం. మలయాళ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్ళను సాధించిన సినిమాల జాబితాలో కూడా చోటు సంపాదించింది ‘మార్కో’.