AAA Sankranti Sambaralu

అరిజోనాలో సంక్రాంతి సంబరాలు.. ఆహ్వానం పలుకుతున్న AAA – ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్

www.theaaa.org  – అమెరికాలో మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడానికి – తెలుగు సమాజాన్ని ఒక్కటి చేయడానికి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) స్ఫూర్తిగా పనిచేస్తోంది.

AAA స్థాపక సందేశం:
‘మన తెలుగు భాషా సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ, మన వారసత్వాన్ని పరిరక్షించడం ప్రతి తెలుగువారి బాధ్యత’ అని మన సంఘం స్థాపకులు హరి మోతుపల్లి గారు పేర్కొన్నారు. ఈ ఆలోచనలతో AAA, ఎన్నారై తెలుగువారిని ఒక్కటిగా చేర్చి, మా కృషిని ముందుకు తీసుకెళ్తోంది.

18 రాష్ట్రాల్లో విస్తరించిన AAA ప్రాధాన్యత:
అమెరికాలోని 18 రాష్ట్రాల్లో AAA చాప్టర్లు తెలుగు వారిని ప్రతిష్టాత్మకంగా ప్రోత్సహిస్తూ, మన సంస్కృతికి గౌరవం తీసుకువస్తున్నాయి.

అరిజోనాలో సంక్రాంతి సంబరాలు:
ఈ ఫిబ్రవరి 1, 2025, శనివారం డ్రీమ్ సిటీ కమ్యూనిటీ సెంటర్లో AAA తన సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోనుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మీ కుటుంబ సభ్యులందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maharastra: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం రెడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *