Crime News: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నందిగామలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గోళ్ళముడి గ్రామ సమీపంలో ఉన్న సుబాబుల్ తోటలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. యువకుడిని చంపి పడేసినట్లుగా కనిపిస్తుంది.
సేకరించిన సమాచారం ప్రకారం … చనిపోయిన వ్యక్తి నందిగామ మండలం పల్లగిరి గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా గా గ్రామస్థులు గుర్తించారు. యువకుల మధ్య గొడవ కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పల్లగిరి గ్రామానికి చెందిన ఇద్దరిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.