Mukunda: ప్రముఖ నటుడు నిర్మాత నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల ‘ముకుంద’ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమా 2014 డిసెంబర్ 24న విడుదలయింది. టాగూర్ బి.మధు, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటించారు. పొలిటికల్ డ్రామాలో అండర్ కరెంట్ గా లవ్ స్టోరీని చొప్పించి ఆకట్టుకున్నారు శ్రీకాంత్ అడ్డాల.
ఇది కూడా చదవండి: Karimnagar: కరీంనగర్‌లో హామీలు అమలు ఎప్పటికి మోక్షమెప్పుడ.?
Mukunda: ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ స్వరకల్పన చేశారు. పదేళ్ళ క్రితం ‘ముకుంద’తో హీరోగా జనం ముందు నిలచిన వరుణ్ తేజ్ ఆ తరువాత “తొలి ప్రేమ, ఫిదా” వంటి హిట్స్ నూ చూశారు. “కంచె, లోఫర్, ఎఫ్-2, ఎఫ్-3” చిత్రాల్లోనూ వరుణ్ తేజ్ నటించి అలరించారు. ఈ యేడాది “ఆపరేషన్ వేలంటైన్, మట్కా” చిత్రాలతో జనాన్ని పలకరించిన వరుణ్ తేజ్ అంతగా ఆకట్టుకోలేక పోయారు. రాబోయే సంవత్సరంలో వరుణ్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి