Spirit

Spirit: ఏదేమైనా స్పిరిట్ రిలీజ్ డేట్ మారదు.. కన్ఫర్మ్ చేసిన వంగా

Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా స్పిరిట్’ (Spirit). ‘రాజా సాబ్’ తర్వాత ప్రభాస్ లైనప్‌లో ఉన్న ‘స్పిరిట్’తో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauzi) సినిమాలపై అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత వంగా నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ‘స్పిరిట్’ విడుదల మరింత ఆలస్యం కావచ్చంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గట్టి స్పష్టతనిచ్చారు.

ఇప్పటికే 50 రోజుల షూట్ పూర్తి – ప్లాన్ ప్రకారమే సాగుతోంది..

సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రోమాంచకం’ (సెప్టెంబర్ 3 విడుదల) సినిమా  ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ‘స్పిరిట్’ సరిలీజ్ డేట్ పైన వస్తున్న వార్తలపైనా స్పందించారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే దాదాపు 50 రోజుల రెగ్యులర్ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. మరో 65 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, మొత్తం సినిమాని కేవలం 115 నుంచి 120 రోజుల్లో పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ఉన్నామని వెల్లడించారు. ఒక భారీ పాన్-ఇండియా స్టార్ సినిమాకు ఇది చాలా వేగవంతమైన షెడ్యూల్.
‘ఫౌజీ’ తర్వాత మళ్లీ ‘స్పిరిట్’ సెట్స్‌లోకి ప్రభాస్..
ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించిన తన భాగాన్ని పూర్తి చేసిన వెంటనే తిరిగి ‘స్పిరిట్’ సెట్స్‌లో జాయిన్ కానున్నారు.
  1. వేగవంతమైన వర్కింగ్ స్టైల్: మిగిలిన 65 రోజుల షూటింగ్‌ను రాబోయే ఐదు నెలల వ్యవధిలో సులభంగా పూర్తి చేయవచ్చని చిత్ర యూనిట్ విశ్వాసంతో ఉంది.
  2. భారీ వీఎఫ్‌ఎక్స్ ఆధారపడకపోవడం: సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో అతిపెద్ద గ్రాఫిక్స్ (CGI) లేదా సుదీర్ఘమైన పోస్ట్ ప్రొడక్షన్ అవసరం పెద్దగా ఉండదు. కంటెంట్, ఇంటెన్స్ ఎమోషన్స్ ఆధారంగా నడిచే కథ కావడంతో అవుట్‌పుట్ వేగంగా వస్తుంది.

ముందుగా ప్రకటించిన విధంగానే మార్చి 5, 2027న ‘స్పిరిట్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావడం ఖాయమని వంగా తేల్చి చెప్పడంతో డార్లింగ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *