Karimnagar

Karimnagar: కరీంనగర్‌లో హామీలు అమలు ఎప్పటికి మోక్షమెప్పుడ.?

Karimnagar: నాటి నుంచి నేటి వరకు కరీంనగర్ జిల్లా ఎంతో మంది రాజకీయ నాయకులను అందించింది. రాష్ట్ర మంత్రి వర్గంలో కరీంనగర్ నుంచి ఎప్పుడు మంత్రి ఉండేవారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ తర్వాత గంగుల కమలాకర్ జిల్లా మంత్రులుగా ఉన్నారు.కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయట. కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, మానకొండూర్ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు లేకపోవడంతో మంత్రి పదవి వరించలేదు. దీంతో కరీంనగర్ మంత్రి లేని జిల్లాగా మిగిలిపోయింది.

Karimnagar: జిల్లాల పునర్విభజన అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గం సిద్ధిపేట జిల్లా పరిధిలోకి వెళ్ళిపోయింది.
గతంలో కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం కరీంనగర్‌కు ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉండి సంవత్సరం గడుస్తున్నా జిల్లాకు ప్రత్యేక నిధులు రాలేదన్న చర్చ జోరుగా నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Mass: ఇరవై ఏళ్ళ ‘మాస్’

Karimnagar: గత దశాబ్ద కాలంగా కరీంనగర్‌కు మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్ హయాంలో నిధుల వరద పారింది.వీటికి తోడుగా కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదా రావడం స్పెషల్ ఫండ్స్‌కి తోడుగా అప్పటి బీఆర్ఎస్ నిధులు విడుదల చేయడంతో కరీంనగర్ మోడల్ సిటీగా అభివృద్ధి చెందింది. గుజరాత్ సబర్మతి నదికి సమానంగా లోయర్ మానేరుడ్యామ్ నిర్మాణం రాష్ట్రంలోనే రెండవ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం ఆ ప్రాంగణంలో నిర్మించిన ఐటీ టవర్ కరీంనగర్‌కె తలమానికంగా మారాయి. ఆ పనులన్నీ తామంటే తామే చేశామని బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ ప్రచారాలు చేసుకున్నాయి.అభివృద్ధి పనులపై అప్పటి మంత్రి గంగుల కమలాకర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ చర్చకు సై అంటే సై అని విమర్శనాస్ర్తాలు సంధించారు.విమర్శ ప్రతి విమర్శలు ఎలా ఉన్న అభివృద్ధి పనులు ఎక్కడా ఆగలేదనేది అందరికి తెలిసిందే…

Karimnagar: కరీంనగర్ జిల్లాకు గడిచిన సంవత్సరాలు ప్రత్యేక నిధులు రాలేదన్న చర్చ నడుస్తుంది. ఇదే విషయాన్నీ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధిష్టానందృష్టికి తీసుకెళ్లారని అయితే హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలోకి వస్తుందని సూచించారట… ఇదే విషయాన్నీ ఆయన అనుచరులు చర్చకు తెరలేపారు.కరీంనగర్‌లో ఒక్కప్పుడు నిధుల వరుద పారిన… కానీ ఇప్పుడు స్పెషల్ ఫండ్స్ మాట పక్కన బెడితే… ప్రస్తుతం నడుస్తున్న పనులకె నిధుల కొరత ఏర్పండింది.

ALSO READ  KTR: సంగారెడ్డి జైలుకు కేటీఆర్‌

ఇది కూడా చదవండి: Health Tips: ఆస్తమా, కీళ్లవ్యాధులకు బొప్పాయి పండతో చెక్

Karimnagar: అయితే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్ పర్యటనలో ఇచ్చిన హామీల అమలకు నోచుకోకపోవడంప్రస్తుతం జరుగుతున్న పనులకు నిధులపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ అటాక్ చేస్తూనే ఉన్నాయి.నిధులతోనే సమాధానం చెప్తామని మరో నాలుగు సంవత్సరాల్లో నిధులు తెచ్చి చూపుతామనేది హస్తం నేతల మాట…
స్థానికంగా మరింత నష్టం జరగకుండా ఉండాలన్న రాబోయే రోజులలో తమ మార్క్ చాటాలన్న వేల కోట్ల రూపాయల
నిధులు తప్పనిసరి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 800 కోట్ల రూపాయలు, పెద్దపల్లి జిల్లా పర్యటనలో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు మొండి చెయి చూపరని లేటైనా సీఎం పర్యటన ఖరారైతే నిధులు కేటాయిస్తారనేది హస్తం నేతల ధీమాగా తెలుస్తుంది.స్మార్ట్ సిటీ కరీంనగర్‌లో అభివృద్ధి మాట పక్కన బెడితే స్థానికంగా రోజు రోజుకు హస్తం పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఎలా భర్తీ చేశారన్నది వేచి చూడాల్సిందే..

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *