ms dhoni

MS Dhoni: భార్య క్రికెట్ నాలెడ్జ్.. ధోనీ షాక్

MS Dhoni: నీకు క్రికెట్ రూల్స్ తెలియవు.. ఇలా ధోనీని ఎవరైనా అనగలరా? అనేంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? బుర్రలో గుజ్జున్నోడు ఎవరైనా ధోనీని క్రికెట్ గురించి తెలియదు అంటారా అని మీకూ కోపం రావచ్చు. కానీ, ఒకరు ఆ మాట అన్నారు. ఆ కథాకమామిషు తెలియాలంటే వాచ్ దిస్..స్టోరీ.

MS Dhoni: నేను చెప్పేది నిజం…నీకు క్రికెట్ గురించి తెలియదంటూ తన సతీమణి  సాక్షి కసిరిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు ధోనీ. నీకు రూల్స్‌ తెలియవు.. నేను చెప్పినట్లే జరుగుతుంది అని భర్తకే పాఠాలు చెప్పినంత పని చేసిన ఆ ఇన్సిడెంట్ గురించి ధోనీ వివరించాడు. ఓరోజు నేను, సాక్షి కలిసి ఇంట్లో వన్డే మ్యాచ్‌ చూస్తున్నాం. సాధారణంగా ఇద్దరం కలిసి టీవీ చూస్తున్నపుడు మేము క్రికెట్‌ గురించి మాట్లాడుకోం. అయితే, ఆ రోజు మ్యాచ్‌లో.. బౌలర్‌.. వైడ్‌ బాల్‌ వేశాడు. బ్యాటర్‌ మాత్రం షాట్‌ ఆడేందుకు ముందుకు రాగా.. వికెట్‌ కీపర్‌ బంతిని అందుకుని స్టంపౌట్‌ చేశాడు.

ఇది కూడా చదవండి: Harshit Rana: బరువు తగ్గి…భారత జట్టులోకి వచ్చి.. హర్షిత్ రాణా ఇన్ స్పిరేషన్ స్టోరీ

MS Dhoni: అయితే, నా భార్య మాత్రం అతడు అవుట్‌ కాలేదనే అంటోంది. అ‍ప్పటికే ఆ బ్యాటర్‌ పెవిలియన్‌ వైపు వెళ్లిపోతున్నాడు. అయినా సరే.. అంపైర్లు అతడిని వెనక్కి పిలిపిస్తారని.. వైడ్‌ బాల్‌లో స్టంపౌట్‌ పరిగణనలోకి తీసుకోరని వాదించింది. అప్పుడు నేను.. వైడ్‌బాల్‌కి స్టంపౌట్‌ అయినా అవుటైనట్లేనని.. కేవలం నో బాల్‌ వేసినపుడు మాత్రమే బ్యాటర్‌ స్టంపౌట్‌ కాడని చెప్పాను. అయినా సరే తను వినకుండా నీకు క్రికెట్‌ గురించి తెలియదు.. ఊరుకో అంటూ కసిరిందన్నాడు ధోనీ. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తర్వాత సదరు బ్యాటర్‌ వెనక్కి వస్తాడు చూడంటూ చెబుతూనే ఉందట. అయితే, అప్పటికే ఆ బ్యాటర్‌ బౌండరీ లైన్‌ దాటి వెళ్లిపోవడం.. కొత్త బ్యాటర్‌ రావడం జరిగినా..అప్పుడు కూడా సాక్షి.. ఏదో తప్పు జరిగిందిఅంటూ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసిందంటూ సాక్షితో జరిగిన సరదా ఇన్సిడెంట్ ను ప్యాన్స్ తో పంచుకుని నవ్వులు పూయించాడు లెజెండ్ ధోనీ.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: ప‌సికందు ప్రాణం తీసిన త‌ల్లీకూతుళ్లు.. త‌ల్లితో క‌లిసి క‌న్న‌కూతురు ఉసురుతీసిన మ‌హిళ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *