MS Dhoni – IPL 2025: ధోనీ మైదానంలో కనిపిస్తే చాలు అనుకుంటారు అతని ఫ్యాన్స్. ఐపీఎల్ లో మైదానంలో ధోనీని చూస్తే కిర్రెక్కి పోతారు క్రికెట్ లవర్స్. కొంతకాలంగా ధోనీ ఇకపై ఆడతాడా లేదా అన్నదే సస్పెన్స్. ఇప్పుడు ధోనీ చెప్పిన మాటలతో క్లారిటీ వచ్చింది. మరో మూడేండ్లు తలా సీఎస్కే కు ఆడడం దాదాపు ఖాయమైనట్లే. దీంతో సీఎస్కే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
MS Dhoni – IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌కు త్వరలో మెగా వేలం జరగనుంది. ఆలోపు రిటెన్షన్, రైట్ టు మ్యాచ్‌తో ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తమవద్దే అట్టిపెట్టుకోవాల్సి ఉంది. ఇందుకోసం అక్టోబర్ 31 వరకు మాత్రమే గడువుంది. ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ కూడా అధికారికంగా జాబితాలను విడుదల చేయలేదు. అయితే, ఒకే ఒక్క ప్లేయర్ విషయంలోనే అభిమానుల్లో తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. అతడు ఈసారి ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ.. ఈ ఉత్కంఠకు ఎంఎస్ ధోనీనే తెరదించాడు. ఇకపై నేను ఆడబోయే క్రికెట్‌ను మరింత ఆస్వాదించాలని అనుకుంటున్నా. ప్రొఫెషనల్ గేమ్ ఆడేవారు ఎల్లవేళలా ఎంజాయ్ చేయలేరు. కానీ, నేను మాత్రం అలా ఉండకూడదని భావిస్తున్నా రాబోయే కొన్నేళ్లు ఆటను ఆస్వాదిస్తా. అందుకోసం గత తొమ్మిది నెలలుగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించా నంటూ ధోనీ చెప్పాడు.
MS Dhoni – IPL 2025: ఐపీఎల్‌లో కేవలం రెండున్నర నెలలు మాత్రమే ఆడుతారు కాబట్టి అందుకోసం పక్కాగా ప్లాన్ చేసుకుని అదే సమయంలో వ్యక్తిగత జీవితానికి చోటివ్వాలని ధోనీ అన్నాడు. దీంతో వచ్చే సీజన్‌లోనే కాకుండా.. మరో మూడేండ్లపాటు ఎంఎస్ ధోనీని మైదానంలో చూసే అవకాశం ఉంటుందనేలా ధోనీ మాటలు చెబుతున్నాయి ఐపీఎల్‌లో తాను ఆడడంపై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టినట్లుగా .. మరికొన్నేళ్లు క్రికెట్ ఆడేందుకు తాను సిద్ధమవుతున్నట్లు ధోనీ చెప్పాడు. రిటైన్ చేసుకొనే ఆటగాళ్లను కనీసం మూడేళ్లపాటు ఆడించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మరో మూడేళ్ల వరకు అతడిని మైదానంలో చూసే అవకాశం ఉంది.