Mrunal Thakur

Mrunal Thakur: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన మృణాల్?

Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్, సినిమా ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అడివి శేష్ సరసన డెకాయిట్ సినిమాలో నటిస్తూనే, బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్నారు. సన్నాఫ్ సర్దార్ 2 రిలీజ్ సమయంలో ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్న మృణాల్, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. త్వరలోనే పెళ్లి చేసుకొని, కుటుంబ జీవితంలో స్థిరపడాలని కలలు కంటున్నానని, అయితే ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తి దృష్టి ఉందని మృణాల్ వెల్లడించారు.

Also Read: Surveen Chawla: కాస్టింగ్ కౌచ్‌తో కెరీర్‌కు బ్రేక్‌.. రానా హీరోయిన్ షాకింగ్ రివీల్స్!

ఇండస్ట్రీలో ఇంకా ఎన్నో సాధించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న ఈ హీరోయిన్, కెరీర్‌లో సంపూర్ణ సంతృప్తి సాధించాకే వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడతానని చెప్పారు. పెళ్లి తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్న మృణాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vishnu Vishal: బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ ని లైన్ లో పెట్టిన విష్ణు విశాల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *