Etela Rajender: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే హైడ్రా, మూసీ బాధితుల పక్షాన రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న తాజాగా లగచర్ల ఘటనపై, వివిధ పాలనా విధానాలపై ఆయన వైఖరిని తప్పుబట్టారు. ఆయనకు వత్తాసు పలుకుతున్న అధికారులపై సోమవారం ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
Etela Rajender: రేవంత్‌రెడ్డికి ఓటేసి కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా కొడంగల్ నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏర్పడిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లే లగచర్ల ఘటనకు స్కెచ్ వేసుకొని కావాలనే దాడులు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో ఆయన సోదరుడి అరాచకాలు మితిమీరి పోతున్నాయని విమర్శించారు.
Etela Rajender: లగచర్లతో పాటు సమీప గ్రామాల్లో రూ.50 లక్షల విలువైన భూమిని కేవలం రూ.10 లక్షలు ఇచ్చి లాక్కోవాలని చూస్తున్నారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. 144 సెక్షన్ పెట్టిన ప్రజాప్రతినిధులను లగచర్ల, ఇతర బాధిత గ్రామాలకు వెళ్లనీయకుండా ఆపుతున్నారి విమర్శించారు. గతంలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తన సొంత నియోజకవర్గ పరిధిలో ఉన్న లగచర్లకు వెళ్లనీయకుండా పోలీసు అధికారులు అడ్డుకున్నారని తెలిపారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని హెచ్చరించారు.
Etela Rajender: ప్రభుత్వం అవసరాల కోసం భూములను తీసుకోవడం వేరని, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి సర్కారును నిలదీశారు. ఇలాంటి నియంతలకు సమయం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం తగిన రీతిలో బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. లగచర్ల రైతులకు సంకెళ్లు వేయడం, థర్డ్ డిగ్రీ చేయడం అక్రమమని పేర్కొన్నారు.
Etela Rajender: ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడూ బాగుపడడని ఈటల రాజేందర్ చెప్పారు. అధికారులు చట్టాలను పక్కనబెట్టి ఇలా అక్రమదారులకు సపోర్ట్‌గా నిలవడం మానుకోవాలని హితవు పలికారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు రైతుల భూములను అప్పనంగా అప్పగించాలని చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ హెచ్చరించారు.