AP News: ఇద్దరు తిట్టుకున్నారు. చి …నీతో మాట్లాడాను అని ఆ ఇంటి పెద్ద పనికి వెళ్ళిపోయాడు. పనిలో తన పని తానూ చేసుకుంటున్నాడు. అంతలోనే ఓ ఫోన్. ఇంటి వద్ద అలా జరిగింది అని. గొడవ తర్వాత …భర్తపై కోపమో లేక…ఆవేశమో కానీ ..ఏ నిర్ణయం ఐతే తీసుకోకూడదో అదే తీసుకుంది. నవమాసాలు మోసి కన్న …బిడ్డలను..తన చేతులతోనే విషం కలిపినా అన్నం పెట్టి ప్రాణాలను తీసింది. తన ప్రాణం కూడా తీసేసుకుంది.
భార్య,భర్తల మధ్య తలెత్తిన ఓ చిన్న వివాదం ఆ కుటుంబాన్నే ఛిద్రం చేసింది. ఆ ఇల్లాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఇందులో ఆమెతో పాటు చిన్నకుమారై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడ దివీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహంతి రామకృష్ణ, మాధవి దంపతులకు ఇద్దరు పిల్లలు. తగరపువలసలో ఉంటున్నారు.
అయితే, ఇద్దరి మధ్య పలుసార్లు వాగ్వాదం జరిగింది. మరోసారి వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెందిన రామకృష్ణ ఏమీ తినకుండా విధులకు వెళ్లిపోయారు. ఇంటివద్ద ఉన్న మాధవి మధ్యాహ్నం అన్నంలో పురుగుల మందు కలిసి తను తిని, పిల్లలకూ పెట్టారు. ఈ సమయంలో ఆమె తండ్రి ఫోన్ చేయగా సంభాషణ మధ్యలో సెల్‌ను ఆపేశారు. కంగారుపడ్డ ఆయన తమ బంధువును కుమారై ఇంటికి పంపారు. బంధువు వెళ్లి చూడగా మాధవి, కుమారైలు ఇషిత, రితీక్ష అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే రామకృష్ణకు ఫోన్‌లో చెప్పి ముగ్గురినీ సంగివలస ఎన్నారై ఆస్పత్రికి తరలించారు.
మాధవి చికిత్స పొందుతూ చనిపోయారు. చిన్నారులను మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఆపోలో ఆస్పత్రికి తరలించే క్రమంలో రితీక్ష మృతి చెందారు. ఇషిత పరిస్థితి విషమంగా ఉంది. మాధవి సొంతురూ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురం గ్రామం. మృతురాలి తండ్రి గణపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.