Bomb Threats: విమానాలకు బెదిరింపులు కొనసాగుతున్నాయి తాజాగా మరో 100 విమానాలకు బెదిరింపులు 16 రోజుల్లో 500 బెదిరింపులు ఇద్దరు నిందితుల అరెస్ట్.
దేశంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు కొనసాగుతున్నాయి. నిన్న అంటే 29వ తేదీన కూడా 100కు పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో ఎయిర్ ఇండియాకు చెందిన 36, ఇండిగోకు చెందిన 35, విస్తారాకు చెందిన 32 విమానాలు ఉన్నాయి. అయితే, విచారణలో, బెదిరింపులన్నీ నకిలీవని తేలింది.
ఇది కూడా చదవండి: EC on Congress: ఈవీఎంలపై తప్పుడు ప్రచారం మానుకోండి.. కాంగ్రెస్ కు ఈసీ సూచన
Bomb Threats: మరోవైపు విమానాల్లో బాంబు బెదిరింపు కేసులో మరో నిందితుడిని గుర్తించారు. నాగ్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన వ్యక్తి మహారాష్ట్రలోని గోండియాకు చెందిన జగదీష్ ఉకే (35). ఇతను ఉగ్రవాదంపై ఓ పుస్తకం కూడా రాశాడు.
నకిలీ ఈమెయిల్స్‌పై విచారణ జరిపి నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు డీసీపీ శ్వేతా ఖేద్కర్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇతను 2021లో కూడా ఓ కేసులో అరెస్టయ్యాడు.
16 రోజుల్లో 500కు పైగా విమానాలు బెదిరింపులకు గురయ్యాయి. విమానాల్లో నకిలీ బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు ఇప్పటికే పట్టుబడ్డారు.