Monalisa: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష దండలు అమ్ముకునే మోనాలిసా. ఆమె యొక్క డస్కీ స్కిన్ టోన్, చక్కని చిరునవ్వు, తెనకళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో, కుంభమేళా సందర్శించే అనేక మంది మోనాలిసాతో ఫోటోలు దిగేందుకు ఆసక్తిగా ముందుకు వచ్చారు, దాంతో ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయింది. త్వరలోనే బాలీవుడ్ సినిమాల్లో కనిపించేందుకు సిద్ధమవుతోంది.
Also Read: Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం!.. 2032లో భూమి అంతం తప్పదా?
బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. మోనాలిసా ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటోంది. అయితే తాజాగా డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి మోనాలిసా కేరళకు వెళ్లింది.
ఆమె ఒక జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొని, అక్కడ జ్యువెలరీ షోరూమ్ యజమాని ఆమెకు రూ. 15 లక్షల విలువైన వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు, ఆమెకు విదేశీ పర్యటన ఆహ్వానం వచ్చింది, ఫిబ్రవరి 26వ తేదీన నేపాల్‌లో జరిగే శివరాత్రి వేడుకల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ పర్యటనతో ఆమె అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందేందుకు అవకాశం ఏర్పడింది.