Mohan Babu:సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ మంజూరైంది. జర్నలిస్టుపై దాడి కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మోహన్‌బాబు విన్నపాన్ని విన్న సుప్రీం ధర్మాసనం ఆయనకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. దీంతో ఆయనకు కొంతకాలం కుటుంబ సమస్యలు, ఇతర కేసుల పరిష్కారానికి గడువు దొరికినట్టయింది.
Mohan Babu:కుటుంబ వివాదాల సమయంలో జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంటివద్దకు వచ్చిన ఓ మీడియా ప్రతినిధిపై ఆయన దాడికి దిగారు. ఈ క్రమంలో మోహన్‌బాబుపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. కానీ, హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది.
Mohan Babu:ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టులో జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆరోజు జరిగిన ఘటనలు, మొత్తం వ్యవహారాన్నంతా మోహన్‌బాబు తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు.
Mohan Babu:జల్పల్లిలోని తన క్లయింట్ నివాసంలో అనుకోకుండా జరిగిన ఘటన అని, తన క్లయింట్‌కు, ఆయన కొడుకుకు మధ్య విద్యాసంస్థకు సంబంధించిన వ్యవహారం, దానితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యా సంస్థలు, కుటుంబ పరమైన ఇతర అంశాలపై వివాదం చెలరేగిందని చెప్పారు. ఇది బయటకు సంబంధం లేని విషయమని కోర్టుకు తెలిపారు.
Mohan Babu:అనుకోకుండా జర్నలిస్టుపై జరిగిన ఘటనతో ఆయన స్వయంగా జర్నలిస్టు వద్దకు వెళ్లి పరామర్శించారని, క్షమాపణలు చెప్పారని, ఆర్థికపరమైనవే కాకుండా అన్ని రకాల సహకారాలు అందిస్తానని లిఖితపూర్వకంగా బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మోహన్‌బాబుకు బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది.

