Mohan Babu: కుటుంబాన్ని చుట్టుమట్టిన వివాదాల సుడిగుండం నుంచి సినీ నటుడు మోహన్‌బాబు ఇంకా బయటపడలేదు. చిన్నవివాదం కేసుల దాకా వెళ్లడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తొందరపాటుతో జరిగిన పొరపాట్లను ఎంతగా సరిదిద్దుకుందామన్నా తన వల్లకావడం లేదు. కేసుల నుంచి తప్పించుకుందామని ఎంతగా ప్రయత్నించినా సాధ్యంకాక చివరిగా సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
Mohan Babu: హైదరాబాద్ జల్‌పల్లిలోని తన ఇంటిలో వివాదాల నేపథ్యంలో వార్తల సేకరణకు వెళ్లిన జర్నలిస్టుపై అతని మైక్ తీసుకొని మోహన్‌బాబు దాడి చేసి గాయపర్చారు. ఈ కేసు వ్యవహారంలో ఆయనను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయనను అరెస్టు చేయక ముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, కేసు విచారణకు నిరాకరించింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Mohan Babu: జర్నలిస్టుపై దాడి కేసును ఎదుర్కొంటున్న మోహన్‌బాబును పోలీసులు అరెస్టు చేయకముందే మోహన్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత స్వయంగా ఆయన తానెక్కడికీ వెళ్లలేదని, తన ఇంట్లోనే ఉన్నానని ప్రకటన విడుదల చేశారు. ఆ వెంటనే బాధితుడైన జర్నలిస్టు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి స్వయంగా వెళ్లాడు మోహన్‌బాబు. ఆయనకు, ఆయన కుటుంబానికి, మీడియాకు బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. అతని వైద్య ఖర్చులకూ సాయం చేసేందుకు హామీ ఇచ్చారు.
Mohan Babu: ఈ దశలో మోహన్‌బాబు తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ తర్వత ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గత డిసెంబర్ 23న కూడా కొట్టివేసింది. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకున్నా, ఏసమయంలోనైనా అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ఆయన ముందస్తుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.