MLA Yashaswini Reddy: గ్రామాల్లో సమస్యలపై ప్రజలు రగిలిపోతున్నారు. పసిపిల్లలకు పెట్టే అన్నం కూడా సరిగా ఉండటంలేదని ఎమ్మెల్యేను నిలదీశారు ఓ ఊరి ప్రజలు, విద్యార్థులు. మహబూబ్బాద్ జిల్లా తొర్రూరు మండలంలో పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఎదుట గ్రామ మహిళలు, విద్యార్థులు తీవ్ర నిసన వ్యక్తం చేశారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు.
MLA Yashaswini Reddy: తొర్రూరు మండలం అమ్మాపురంలో మధ్యాహ్న భోజన పథకానికి వంటసామగ్రిని పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాఠశాలకు గురువారం వెళ్లారు. కార్యక్రమం పూర్తవగానే ఆమె వెళ్లిపోతుండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రలు అడ్డుకొని సమస్యలను ఏకరువు పెట్టారు. విద్యార్థులు కూడా ఆమెకు సమస్యలు చెప్పేందుకు వెళ్తుండగా, కార్యకర్తలు, గన్మెన్ అడ్డుకొని వారించారు. అయినా చేస్తా.. అంటూ చప్పుడు చేయకుండానే ఆమె వెళ్లిపోవడంపై గ్రామస్థులు తీవ్ర అగ్రహంతో ఉన్నారు.
MLA Yashaswini Reddy: భోజనం అస్సులు సరిగా ఉండటం లేదని, తినలేకపోతున్నామని విద్యార్థులు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి ఫిర్యాదు చేశారు. అయినా ఎమ్మెల్యే పట్టించుకోకుండా వెళ్లారని విద్యార్థులు వాపోయారు. తాము ఎన్నాళ్లు ఇలాంటి భోజనం చేయాలని ప్రశ్నిస్తున్నారు.

