MLA Raja Singh: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఆ పార్టీ కీలక నేతలపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోని కొందరు నేతలపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుందన్న వార్త హల్‌చల్ చేసింది. దీంతో స్పందించిన ఆయన పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీలోని ఓ వర్గం నేతల టార్గెట్‌గా మాట్లాడిన ఆయన ఏకంగా పార్టీకే సవాల్ విసరడంపై దుమారం రేపుతున్నది.
MLA Raja Singh: రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ముందుగా నోటీసులు జారీ చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని జరుగుతున్న ప్రచారం మేరకు రాజాసింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో దొంగలంతా ఒక్కటయ్యారని, తనకు నోటీసులు ఇవ్వడం కాదు.. దమ్ముంటే తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే అందరి బాగోతాలు బయటపెడతానని హెచ్చరికలు జారీ చేశారు.
MLA Raja Singh: పార్టీకి ఎవరు నష్టం చేస్తున్నారో అన్న విషయాలను బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నేతలను హెచ్చరించారు. ఇంటి దొంగలంతా ఒక్కటై బీజేపీని బీఆర్ఎస్ నాయకులకు తాకట్టు పెడుతున్నారని, కొంచెం ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పార్టీని బీఆర్ఎస్‌కు తాకట్టు పెడతారని గతంలో రాజాసింగ్ ఆరోపించారు.
MLA Raja Singh: ఇటీవల గోసంరక్షణ గురించి తాను మాట్లాడుతుంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఫోన్లలో కాదని, దమ్ముంటే తనకు ఎదురుగా వచ్చి కొట్లాడాలని సవాల్ విసిరారు. ధర్మం కోసం చంపడానికైనా, తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నానని తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి.

