Danam Nagender: జీహెచ్ఎంసీ పనితీరుపై హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. పారిశుధ్యం విషయంలో జీహెచ్ఎంసీ పనితీరు బాగాలేని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. స్వయంగా తన ఇంటి వద్దే ఈ సమస్య నెలకొన్నదని, దానిని తొలగించడం లేదని చెప్పుకొచ్చారు.
Danam Nagender: నా ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయింది. ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కొంత చెత్తను తీసి, మిగతాదంతా అలాగే ఉంచేసి వెళ్లారు. దుర్వాసనతో పరిసర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకింత నిర్లక్ష్యం అంటూ ప్రశ్నించారు. చేసే పని పకడ్బందీగా, సక్రమంగా చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. నిర్ల్యక్షం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Danam Nagender: బీఆరెస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ గత ఎంపీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీహెచ్ఎంసీ పనితీరుపై సొంతపార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణలు చేయడం.. దాని పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తుందని నగరవాసులు అంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్త తొలగింపుపై చిత్తశుద్ధి చూపుతారో లేదో చూడాలి మరి.

