అసత్యాలు, కట్టుకథలే ఆధారంగా అరెస్ట్
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు మీడియాలో ప్రచారం చేస్తున్నవన్నీ కేవలం కట్టుకథలే అని మిథున్‌రెడ్డి కొట్టిపారేశారు. తనను రాజకీయంగా వేధించాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ అరెస్ట్ జరిగిందని ఆయన ఆరోపించారు.
“కక్ష సాధింపు చర్యల చరిత్ర నేటిది కాదు. 2014-19 మధ్య జరిగిన తిరుపతి ఎయిర్‌పోర్ట్ ఘటనలో కూడా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే” అని మిథున్‌రెడ్డి అన్నారు. ఎన్ని కేసులు పెట్టిన, ఎలాంటి వేధింపులు ఎదురైనా తాను భయపడేది లేదని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ఎన్నికల్లో ఆశావహుల కోసం సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జైలులో తీవ్రవాదిలా చూశారు
జైలులో తనను చూసిన తీరుపై మిథున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి జైలులో తనను ఒక తీవ్రవాది మాదిరిగా చూశారని, తాను జైలులో ఉన్నన్ని రోజులు తన దగ్గరికి రావడానికి కూడా ఒక్కరు సాహసించలేదని వాపోయారు.
అయితే, ఈ కష్ట సమయంలో తనకు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలవడం, వైసీపీ నేతలు చూపిన ధైర్యం మరువలేనిదని, వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాజకీయంగా ఎదురవుతున్న ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటానని, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో తెలిపారు.