Mithali raj: భారత మహిళల జట్టు చారిత్రక విజయం సాధించిన సందర్భంగా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. ఈ విజయం ఒక్కరోజులో వచ్చినది కాదని, నాలుగేళ్ల ప్రణాళిక, నిరంతర కృషి, సరైన మద్దతు ఫలితంగా భారత మహిళల క్రికెట్ నేడు ఈ స్థాయికి చేరిందని ఆమె చెప్పారు.
“కలలకు సరైన మద్దతు ఉంటే అవి నిజమవుతాయి… నిన్నటి గెలుపు అదే నిరూపించింది” అని మిథాలీ పేర్కొన్నారు.
బీసీసీఐ సంస్కరణలే విజయానికి బలం
బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఉన్న సమయంలో మహిళల క్రికెట్‌లో జరిగిన కీలక మార్పులు ఈ విజయానికి బలమైన పునాదిగా నిలిచాయని మిథాలీ తెలిపారు.
ఆమె ముఖ్యంగా ప్రస్తావించినవి:
మహిళలకు పురుషుల్లాగే సమాన మ్యాచ్ ఫీజులు డబ్ల్యూపీఎల్ (వుమెన్స్ ప్రీమియర్ లీగ్) ప్రారంభం దేశీయ క్రికెట్ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ఇండియా–ఏ జట్ల విదేశీ పర్యటనల అండర్–19 స్థాయిలో శక్తివంతమైన టాలెంట్ వ్యవస్థ ఈ చర్యలు అనేక ప్రతిభావంతురాలైన క్రీడాకారిణులను ముందుకు తెచ్చాయన్నారు.
అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పెరిగింది
ఐసీసీ మహిళల క్రికెట్‌కు పెద్దపీట వేసిందని మిథాలీ అన్నారు. ప్రైజ్ మనీని నాలుగు రెట్లు పెంచి 13.88 మిలియన్ డాలర్లు చేయడంఈ నిర్ణయాలు మహిళల క్రికెట్ అభివృద్ధికి పెద్ద ఊపునిచ్చాయని ఆమె అభిప్రాయపడ్డారు
యువతకు ప్రేరణ
“దేశ జెర్సీ ధరించాలని కలలు కనే ప్రతి అమ్మాయికీ ఇది ఒక ప్రేరణ. కలలు నిజం కావాలంటే ధైర్యం, క్రమశిక్షణ, సరైన అవకాశాలు అవసరం” అని మిథాలీ రాజ్ సందేశం ఇచ్చారు.

