తెలంగాణలో ఇద్దరు మిషన్ భగీరథ ఏఈలు మంగళవారం సస్పెన్షన్‌కు గురయ్యారు. నారాయణఖేడ్ మండలంలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందగా, మరో 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో నిర్లక్ష్యంపై బాధ్యులుగా గుర్తించిన ఉన్నతాధికారులు ఆ ఇద్దరిని సస్సెండ్ చేశారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ మంలం సంజీవన్‌రావుపేట గ్రామంలో దసరా పండుగ నాడు మిషన్ భగీరథ నీరు సరఫరా కాలేదు. దీంతో ఆ ఊరిలోని ఓ కాలనీవాసులకు పడావుగా ఉన్న ఓ బావినీటిని సరఫరా చేశారు. దీంతో 100 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా పునరుద్ధరణలో నిర్లక్ష్యం వహించారని గ్రిడ్ ఏఈ రవికుమార్, ఏఈ శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
గ్రామాన్ని అడిషినల్ కలెక్టర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తదితరులు సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వైద్యశిబిరాన్ని పరిశీలించారు.