Ashika Ranganath: తెలుగులో హీరోయిన్ల కొరత బాగా ఉంది. అయినా కన్నడ భామ అషికా రంగనాథ్ కి ఛాన్స్ లు దక్కటం లేదు. గుడ్ లుక్స్ తో పాటు హిట్ సినిమా ఉండి కూడా అమ్మడిని అవకాశాలు పలకరించటం లేదు. తెలుగులో కల్యాణ్ రామ్ ‘అమిగోస్’తో ఎంట్రీ ఇచ్చింది అషికా రంగనాథ్. అయితే ఆరంభం బాగా లేకున్నా ఆ తర్వాత నాగార్జున తో నటించిన ‘నా సామిరంగ’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. 28 ఏళ్ళ అషికా మంచి డాన్సర్ కూడా. ఫ్రీ స్టైల్, బెల్లీ, వెస్ట్రన్ డాన్స్ లో శిక్షణ పొందింది అషికా. ‘నా సామిరంగా’ తర్వాత టాలీవుడ్ లో వరుసగా సినిమాలే అనుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఒక్క సినిమా కూడా దక్కలేదు.
Ashika Ranganath: కన్నడలో బిజీగా సాగుతున్న అషికా తెలుగులో సినిమాలు చేయాలనే ఆకాంక్షతో చిరంజీవి ‘విశ్వంభర’లో చెల్లెలి పాత్రకు కూడా సై అంది. తమిళంలో సిద్ధార్థ్ తో నటించి ‘మిస్ యు’ సినిమా ఈ నెల 29న ఆడియన్స్ ముందుకు రానుంది. సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కుర్రకారుకు వెర్రెక్కించే అషికా కన్నడలో ‘గతవైభవ’ సినిమాతో పాటు పాన్ ఇండియా సినిమా ‘సర్దార్2’లో నటిస్తోంది. మరి రాబోయే ‘మిస్ యు’, ‘విశ్వంభర’, ‘సర్దార్2’తో నైనా అషికాను టాలీవుడ్ లో వరుస అవకాశాలు వరిస్తాయేమో చూద్దాం.