Ishan Kishan: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూర్పుపై ఇప్పుడు పెద్ద డౌటే మొదలైంది అభిమానులకు. అసలే టోర్నీ గెలిచి చాలాకాలం అయి.. గత ఐపీఎల్ లో సెమీస్ లోనే చతికిలపడిన ఎస్ఆర్ హెచ్ ఇప్పుడు గెలుపు గుర్రంగా నిలబడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల ఎంపిక కొంత గందరగోళం సృష్టిస్తోంది. బౌలింగ్ తురుపు ముక్క భువనేశ్వర్ కుమార్ ను వదులుకున్న సన్ రైజర్స్ విషయంలో ఇప్పటికే అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా కొత్త సమస్యను తెరమీదకు తీసుకువస్తున్నారు. ఈ వేలంలో ఇషాన్ కిషన్ 11.25 కోట్లు పోసి కొన్నారు. ఇషాన్ కిషన్ అంత విలువైన ఆటగాడే. కానీ, ఇప్పటివరకూ ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో ఓపెనర్ స్థానంలో అద్భుతాలు సృష్టిస్తూ వస్తున్నాడు. దీంతో ఎస్ఆర్ హెచ్ అతన్ని తీసుకోవడం దుమారం రేపుతోంది.
Ishan Kishan: ఎందుకంటే, ఇప్పటికే ఎస్ఆర్ హెచ్ టీమ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా సంచలనం సృష్టిస్తూ వస్తున్నారు. చాలాకాలంగా వీద్దరు హైదరాబాద్ కు ఓపెనింగ్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇషాంత్ ని తీసుకోవడంతో.. వీరిలో ఎవరిని పక్కన పెడతారు? అనే అనుమానాలు మొదలు అయ్యాయి. ఓపెనింగ్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ కె అవకాశం ఇస్తారు. మరి ఇప్పుడు ఈ ముగ్గురితో ఓపెనింగ్ కోసం కొత్త ఆట టీమ్ మేనేజిమెంట్ ఆడాల్సి వస్తుందంటూ అభిమానులు జోకులు వేస్తున్నారు.