Minister savitha: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాములయ్య కాలనీలో ఇంటి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి చేశారు మంత్రి సవిత. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ప్రతినెలా వృద్ధులకు, వికలాంగులకు,చేనేత కార్మికులకు ఒకటవ తేదీని పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆమె అన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో రాష్ట్రాన్ని అప్పుల ఊబీకీలోక నెట్టిన ఘనుడుి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
