Minister Savitha: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గుంతల రహిత రోడ్ల కార్యక్రమాన్ని మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆర్ అండ్ బి రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేవని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రంగులు రెడ్డికి రంగులు మార్చడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదని ఎద్దేవా చేశారు. సంక్రాంతి పండుగ లోపల రోడ్లన్నీ గుంతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ గా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలియజేశారు. రాష్ట్రంలో కాలరేగిరేసుకొని తిరిగే దమ్ము ధైర్యం తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఉంటుందన్నారు. వైసీపీలో ఐదు సంవత్సరాలలో చేయని అభివృద్ధి నాలుగు నెలల లోనే పూర్తి చేయడం జరిగిందని ఆమె తెలిపారు.
