Minister Savita: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం చేపట్టి రాజదాని అమరావతి వన్నె తెచ్చే విధంగా ఉంటుందని బీసీ చేనేత జోలి శాఖ మంత్రి సవిత సవిత పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్లె పండగలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని రాంపురం పంచాయతీలో రూ.86 లక్షల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్లే హక్కు టిడిపికే ఉందని , వైసిపి పాలనలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానులను అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వ్యక్తి గంపేడు మన్ను కూడా వేసిన పాపాన పోలేదని అన్నారు.
రాష్ట్రంలో చేతగాని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని అన్నారు.మా నాయకుడు రాజధాని నిర్మాణం అమరావతి లోనే చేపడతామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పల్లులన్నీ కూడా పండగలు జరుపుకుంటున్న అన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ఎమ్మెల్యేలు,మంత్రులు,ఎంపీలతో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.

