Kerala: నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటి ప్రభావంతో కేరళ, దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Kerala: దక్షిణ తమిళనాడులోని 11 జిల్లాలకు ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం పడుతున్నది. నీలగిరి జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. ఎక్కడి వారక్కడే నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
Kerala: కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వాగులు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. ఊరూరా వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు నిర్విరామ కృషి చేస్తున్నారు.