Cabinet Expansion: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠకు తెరపడనున్నది. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మంత్రివర్గ విస్తరణ జరిగి తీరుతుందని ఈ సారి కాంగ్రెస్ పార్టీ వర్గాలు తేల్చి చెప్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం జాబితాను సిద్ధం చేసిందని, ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులకు గాను, ఐదింటిని ప్రకటించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
Cabinet Expansion: తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై తుది నిర్ణయం మే 26న తీసుకునే వీలున్నదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే మే 25న ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఆయనతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వారిద్దరూ పార్టీ పెద్దలతో మంత్రి వర్గ విస్తరణ అంశంపై చర్చించినట్టు ప్రచారం జరుగుతున్నది.
Cabinet Expansion: ఈ రోజు (మే 26న) పార్టీ కీలక నేత రాహుల్‌గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అవుతారని తెలిసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చీ రాగానే గవర్నర్‌ను సీఎం కలుస్తారని, మంత్రి వర్గ విస్తరణ అంశాన్ని ఆయనతో చర్చిస్తారని సమాచారం. దీనిని బట్టి మంత్రి వర్గ విస్తరణ అంశం దాదాపు ఖరారు అయిందని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు.
Cabinet Expansion: అదే విధంగా టీపీసీసీ కార్యవర్గంపైనా సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్ చర్చించారని తెలిసింది. గతంలో పంపిన జంబో కార్యవర్గం వద్దని, షార్ట్ చేయాలని వారికి పార్టీ అధిష్టానం పెద్దలు సూచించారని సమాచారం. ఈ మేరకు వారిద్దరూ జాబితాను కుదించేందుకు ఢిల్లీలోనే కొంత కసరత్తు చేసినట్టు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు పెద్ద ఎత్తున పదవులు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల సంఖ్య కూడా పెద్దగానే ఉన్నది. అయితే ముఖ్యంగా నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టీ రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరితో పాటు షబ్బీర్ అలీ, విజయశాంతి తదితరుల్లో ఓ ఐదుగురిని మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.