Narayana : టిడ్కో ఇళ్ల నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, 2014 నుంచి 2019 మధ్య టిడ్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నామని తెలిపారు. మొత్తం 5 లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు. అయితే, గత ప్రభుత్వం ఆ సంఖ్యను 2,60,000 ఇళ్లకు మాత్రమే కుదించిందని విమర్శించారు.
నారాయణ పేర్కొంటూ, గత ప్రభుత్వం అనేక పాలసీలను మార్చడం వల్ల టిడ్కో ప్రాజెక్టులు గందరగోళానికి గురయ్యాయని అన్నారు. దీంతో అనేక పేద కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురుచూస్తూ ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు
ప్రస్తుతం సీఎం చంద్రబాబు పేద ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పేదలకు గృహ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

