Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో మార్షల్స్ అనుచిత వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో మార్షల్స్ అత్యుత్సాహంతో లాబీలో ఉన్న ఇతర వ్యక్తులను తప్పుకోమని హడావుడి చేశారు. ఈ సంఘటన మంత్రి లోకేష్‌ను ఆగ్రహానికి గురి చేసింది. సభ్యుల వ్యవహారాల్లో మీకు ఏం పని? అంటూ మార్షల్స్‌పై లోకేష్ మండిపడ్డారు. మీరు ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నట్లు భావిస్తున్నారా? అని ఆయన చురకలంటించారు. మార్షల్స్ బయటి వ్యక్తులు అసెంబ్లీలోకి రాకుండా నియంత్రించాలి కానీ ఎమ్మెల్యేల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని లోకేష్ స్పష్టం చేశారు.
Also Read: Seethakka: సంక్షేమం, అభివృద్ధి మా ధ్యేయం
ఈ సంఘటన అసెంబ్లీలో మార్షల్స్ విధులపై చర్చను రేకెత్తించింది. మార్షల్స్ తమ పరిధిని మించి వ్యవహరించడం సభ్యులకు ఇబ్బంది కలిగించిందని, వారు కేవలం భద్రత, క్రమశిక్షణ కోసం పని చేయాలని లోకేష్ సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సభ్యులకు స్వేచ్ఛగా కదలడానికి అవకాశం ఉండాలని, అనవసర జోక్యం ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.