War 2: మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో భారీ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది ఆయన తొలి బాలీవుడ్ చిత్రం “వార్ 2”. ఇటీవల విడుదలైన టీజర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా హైప్ పెంచింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా, “వార్ 2” కోసం ఎన్టీఆర్ చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ షూట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీజర్‌కు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తి సినిమాకు కూడా అన్ని భాషల్లో ఆయనే డబ్బింగ్ చెప్పే అవకాశం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2024 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
