Birds Death: సాంబార్ సరస్సు రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఉంది. ఈ సరస్సు దగ్గరకు వేలాది మైళ్ళ దూరం నుంచి అనేక విదేశీ పక్షులు ప్రతి ఏటా వస్తాయి. ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లలను చేసుకుని తరువాత పిల్లలతో సహా వెనక్కి వెళ్లిపోతాయి.
ఈ ఏడాది కూడా అలానే చాలా పక్షులు ఈ సరస్సు వద్దకు వచ్చాయి. అయితే.. గత నెల 26వ తేదీ నుంచి ఇక్కడ పక్షులు చనిపోతున్నాయి. ఇప్పటి వరకు 520 పక్షులు చనిపోయాయి. దీంతో రాష్ట్రంలో తీవ్ర అలజడి రేగింది. పక్షుల మృతిపై పరిశోధన మొదలైంది.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: డబ్బు ఇస్తారని హత్య చేశాడు.. సొమ్ము ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు
ఈ రీసర్చ్ లో పక్షులకు కొన్ని రకాల బ్యాక్టీరియా సోకినట్లు కనుగొన్నారు. క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బాక్తీరియా కారణంగా ఇలా జరిగినట్టు నిర్ధారించారు. ఈ బాక్తీరియా సోకిన పక్షులు ఈకలు రాలిపోవడం.. కాళ్లు పనిచేయకపోవడం వంటి కారణాలతో చనిపోతాయని పరిశోధకులు చెప్పారు. పక్షులను రక్షించడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అస్వస్థతకు గురైన పక్షులకు చికిత్స అందిస్తున్నామని, బాక్టీరియా నివారణ చర్యలు తీసుకుంటున్నామని సామాజిక కార్యకర్తలు తెలియజేసారు.