AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈ నెల 11న సోమవారం శాసనసభ ఉభయ సభల్లో ప్రవేశ పెడతారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను శాసనసభలో సమర్పిస్తారు. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ఈ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆర్థిక శాఖ మంత్రితోపాటు ఉన్నతాధికారులైన రవిచంద్ర, పీయూశ్‌కుమార్, జానకి, నివాస్ తదితరులకు బడ్జెట్‌పై దిశానిర్దేశం చేశారు.
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకపక్షంతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వికాసంపై ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఏమేరకు ఈ బడ్జెట్‌లో ప్రస్పుటిస్తుందోనని విశ్లేషకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులు కూడా జనరంజకంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది.
AP News: రాష్ట్ర బడ్జెట్ అంచనా సుమారు 3 లక్షల కోట్లకు సుమారు అటూ ఇటుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా. కొత్త పథకాలకు కొత్త బిల్లులను కూడా ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నది. ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఆ మేరకు ఆమోదం పొందాల్సి ఉన్నది. ఏదేమైనా ఎన్నో ఆశలతో ఉన్న రాష్ట్ర ప్రజానీకానికి తొలి బడ్జెట్‌లో కేటాయింపులతోనే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఆధారపడి ఉంటాయి.