MIG-29 Crash: వైమానిక దళానికి చెందిన మిగ్-29 విమానం సోమవారం ఆగ్రాలో కూలిపోయింది. రెప్పపాటు సమయంలో విమానం పొలంలో పడింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. యుద్ధ విమానం కూలిపోవడంతో పాటు పేలుడు కూడా జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో మనీష్ మిశ్రా అనే పైలట్ ఉన్నాడు. మంటలు చెలరేగడానికి కొన్ని సెకన్ల ముందు అతను పారాచూట్ సహాయంతో యుద్ధ విమానం నుండి దూకాడు. పైలట్‌ను గ్రామస్తులు అక్కడ నుంచి గ్రామంలోకి తీసుకువెళ్లారు.
ఈ ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ కోర్టు విచారణకు ఆదేశించింది. పంజాబ్‌లోని అడంపూర్‌కు చెందిన ఈ యుద్ధ విమానం మొదట గ్వాలియర్‌లో దిగింది. ఆ తర్వాత గ్వాలియర్ నుంచి జనరల్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఆగ్రా వెళుతోంది.
MIG-29 Crash: ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు, డిఎం, పోలీసు బలగాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్రాష్ తర్వాత, విమానంలో పేలుళ్లు కొనసాగాయి . ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి . వీడియోలో ఫైటర్ విమానం వేగంగా పొలాల్లోకి పడిపోయింది. అది చూసిన ఊరి జనం అటువైపు పరుగులు తీశారు. సహాయం కోసం వారు కేకలు వేశారు. ఇంతలో విమానంలో పేలుళ్లు సంభవించాయి. పరుగు పరుగు అంటూ ఊరి జనం పరుగులు తీశారు. ప్రమాద స్థలానికి కొంత సేపటికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు .
MIG-29 Crash: మరోవైపు, అగ్నిప్రమాదం జరిగిన తర్వాత పైలట్ మనీష్ మిశ్రా యుద్ధ విమానాన్ని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది . దీని తర్వాత అతను ఎజెక్ట్ సిస్టమ్ ద్వారా యుద్ధ విమానం నుండి దూకాడు. పైలట్ ఫైటర్ విమానం కూలిపోయిన ప్రదేశానికి 2 కిలోమీటర్ల దూరంలో పడిపోయాడు . గ్రామస్తులు అతన్ని అక్కడ మంచంపై కూర్చోపెట్టి సేద తీరేలా చేశారు . దీని తర్వాత పైలట్‌ను వైద్య పరీక్షల నిమిత్తం మిలటరీ ఆసుపత్రికి తరలించారు.

