Megastar-Anil : మెగాస్టార్ చిరంజీవి, హిట్ మేకర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తీస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్షన్‌తో కూడిన పవర్‌ఫుల్ రోల్‌తో మరోసారి థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన భారీ సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఫైట్ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
Also Read: Rakul: హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్… రకుల్ సంచలన సమాధానం!
Megastar-Anil : ఇప్పుడు టీమ్ రెండో షెడ్యూల్‌పై ఫోకస్ పెట్టింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 25-30 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో నయనతార, కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ మార్క్ కామెడీ, చిరు చరిష్మాతో 2026 సంక్రాంతికి ఈ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం.