Meenakshi Natarajan

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే

Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ జూలై 31 నుంచి రాష్ట్రంలో పాదయాత్రలు, పలు కార్యక్రమాలు చేయబోతున్నారు. పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా ఆమె ఈ పర్యటనను మొదలుపెట్టనున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ పర్యటనలో పాదయాత్రలతో పాటు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు కూడా ఉంటాయి.

మీనాక్షి నటరాజన్ పర్యటన వివరాలు:
జూలై 31: సాయంత్రం: పరిగి పట్టణంలో పాదయాత్ర.
రాత్రి: పరిగిలో బస.

ఆగస్టు 1: ఉదయం: శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు, ఆపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం.
సాయంత్రం: ఆంధోల్ నియోజకవర్గంలో పాదయాత్ర.

ఆగస్టు 2: ఉదయం: శ్రమదానం, కార్యకర్తల సమావేశం.
సాయంత్రం 5 గంటలకు: ఆర్మూరులో పాదయాత్ర.

ఆగస్టు 3: ఉదయం: శ్రమదానం.
సాయంత్రం 5 గంటలకు: ఖానాపూర్‌లో పాదయాత్ర.

ఆగస్టు 4: ఉదయం: శ్రమదానం అనంతరం కార్యకర్తలు, నాయకులతో సమావేశం.
సాయంత్రం: చొప్పదండిలో పాదయాత్ర, రాత్రి అక్కడే బస.

ఆగస్టు 5: ఉదయం: శ్రమదానం అనంతరం సమావేశం.
సాయంత్రం: వర్ధన్నపేటలో పాదయాత్ర.

ఆగస్టు 6: శ్రమదానం, కార్యకర్తలతో సమావేశం. ఈ కార్యక్రమాలతో మీనాక్షి నటరాజన్ పర్యటన ముగుస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *